బీజేపీతో టీడీపీ జాగ్రత్త.. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-04-02 09:34:23  IST  )

రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఆప్ మద్దతు తెలిపింది. చంద్రబాబు విజనరీ లీడర్ అని ప్రశంసించిన ఎంపీ సంజయ్ సింగ్.. బీజేపీతో అప్రమత్తంగా ఉండాలని టీడీపీని హెచ్చరించారు.

బీజేపీతో టీడీపీ జాగ్రత్త.. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుపై (Amaravati Bill) చర్చ జరుగుతోంది. బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చకు ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ అనుమతించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల సభ్యులు ఈ బిల్లును ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాది. చంద్రబాబు (Chandrababu Naidu) విజనరీ లీడర్ అని ప్రశంసించిన సంజయ్ సింగ్.. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని కేంద్రం నుంచి ఎంత రాబట్టుకుంటారో రాబట్టుకోవాలన్నారు. కేంద్రం నుంచి నిధులు సాధించి అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

బీజేపీతో జాగ్రత్త:

ఈ సందర్భంగా బీజేపీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని సంజయ్ సింగ్ హెచ్చరించారు. బీజేపీ చరిత్ర అంతా మోసం చేయడం విభజించడమేనని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీని అడ్డం పెట్టుకుని మూడు రాజధానుల ఆట ఆడిన బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అమరావతిని రాజధానిగా చేయాలని చెప్పి గేమ్స్ ఆడిస్తోందన్నారు. అందువల్ల బీజేపీతో అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ పార్టీ శిరోమణి అకాలీ దళ్, శివసేన, ఎన్సీపీ, జంతాదళ్ లో వీపీసింగ్‍‍కు, మొరార్జీ సర్కార్‍కు మోసం చేసిన చరిత్ర బీజేపీదన్నారు.

Breaking: అమరావతి బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకించిన వైసీపీ.. ఎంపీల వాకౌట్

Next Story