- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైయస్ జగన్ ను కలిసిన సాల్మన్ కుటుంబ సభ్యులు
బాధిత కుటుంబానికి.. కార్యకర్తలకు అండగా నిలుస్తామని వైసీపీ భరోసా.

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఉన్న పిన్నెల్లి (Pinnelli) గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ (Salmon) ఇటీవల దాడికి గురై చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తు్న్నట్లు వైసీపీ YCP) ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ (YS Jagan) కూడా సాల్మన్ మరణంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు సమంజసమేనా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలకు తెరలేసిందని.. కారకులపై చర్యలు తీసుకోవాలని ఘటన అనంతరం ప్రభుత్వా్న్ని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సాల్మన్ కుటుంబ సభ్యులు వైయస్ జగన్ ను బుధవారం కలిశారు. సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం, కుమార్తె రాహెల్, పిన్నెల్లి గ్రామస్తులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే తమ తండ్రిని అత్యంత కిరాతకంగా చంపారని ఆరోపించారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను దుండగులు, పోలీసులు బెదిరింపులకు గురి చేశారని వివరించారు. తమ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పుకొచ్చారు.
వారి బాధను విన్న వైయస్ జగన్ స్పందిస్తూ.. వైసీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని హామీనిచ్చారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవస్థల గౌరవాన్ని దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. సాల్మన్ కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
READ MORE .....
వస్తున్నా.. ఇకపై ప్రజల్లోనే ఉంటా.. మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన
అహంకారంతో ఉన్నారు: చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ ఫైర్






