అహంకారంతో ఉన్నారు: చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-21 11:48:17  IST  )

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు....

అహంకారంతో ఉన్నారు: చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)పై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ycp Chief Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్‌(Red Book)తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే వైసీపీ(Ycp) నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ లేదని, సూపర్ సెవన్ లేదని, అన్నీ మోసాలేనని వైఎస్ జగన్ విమర్శించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హయాంలో ప్రభుత్వ స్కూళ్లన్ని కళకళలాడాయని, ఇప్పుడు విహీనంగా మారాయన్నారు. గోరుముద్ద క్వాలిటీ లేకుండా పోయిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టారన్నారు. ఆరోగ్యశ్రీని కనుమరుగు అయిందని ఎద్దేవా చేశారు. 108, 104 సేవలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని, ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

READ MORE .....

వ‌స్తున్నా.. ఇక‌పై ప్ర‌జల్లోనే ఉంటా.. మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

వైయస్ జగన్ ను కలిసిన సాల్మన్ కుటుంబ సభ్యులు

Next Story