వ‌స్తున్నా.. ఇక‌పై ప్ర‌జల్లోనే ఉంటా.. మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-21 11:46:36  IST  )

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కేడ‌ర్ తో స‌మావేశం అయ్యారు.ఈ స‌మావేశంలో జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌స్తున్నా.. ఇక‌పై ప్ర‌జల్లోనే ఉంటా.. మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కేడ‌ర్ తో స‌మావేశం అయ్యారు.ఈ స‌మావేశంలో జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుండి ప్ర‌తివారం ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతాన‌ని చెప్పారు. ఏడాదిన్న‌ర త‌ర‌వాత పాద‌యాత్ర మొద‌లుపెడ‌తాన‌ని అన్నారు. దాదాపు ఏడాదిన్న‌ర పాటు ప్ర‌జ‌ల్లోనే ఉంటాని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు జ‌గ‌న్ పార్టీ గొడ‌వ‌ల్లో తీవ్ర‌గాయాల‌పాలై న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న తేలుక‌ట్ట గ్రామానికి చెందిన చ‌ల్లా నాగ‌రాజును జ‌గ‌న్ పరామ‌ర్శించారు. ప‌నిచేయ‌లేని స్థితిలో ఉన్న నాగ‌రాజు కుటుంబం ఇబ్బంది ప‌డుతోంద‌ని ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లగా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చాడు. అంతే కాకుండా ప‌ల్నాడు జిల్లా గుర‌జాల‌నియోజ‌క‌వ‌ర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్య‌క‌ర్త సాల్మన్ మ‌ర‌ణించగా అత‌డి కుటుంబం కూడా వైసీపీ కార్యాల‌యంలో జ‌గ‌న్ కు క‌లిసింది. వారికి సైతం అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

READ MORE .....

వైయస్ జగన్ ను కలిసిన సాల్మన్ కుటుంబ సభ్యులు

అహంకారంతో ఉన్నారు: చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ ఫైర్

Next Story