నిబద్ధత ఉంది.. అభివృద్ధి చేస్తారు: అమరావతి అభివృద్ధిపై ఆర్ కృష్ణయ్య ధీమా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 09:32:38  IST  )

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు..

నిబద్ధత ఉంది.. అభివృద్ధి చేస్తారు: అమరావతి అభివృద్ధిపై ఆర్ కృష్ణయ్య ధీమా
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. అమరావతి చట్ట బద్ధత బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అమరావతి బిల్లును రాజకీయ కోణలో చూడకూడదన్నారు. ఏపీ అభివృద్ధిపై మోడీకి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ఆధ్యాత్మికంగానూ, చారిత్రకంగాను అమరావతి చాలా గొప్ప ప్రాంతమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్లు అమరావతి కూడా చేస్తారని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి కేంద్రం సైతం కట్టుబడి ఉందని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

గర్భిణీని పొత్తి కడుపులో తన్నారు: నాటి అరాచకాలపై రామ్మోహన్ నాయుడు ఎమోషనల్

బీజేపీతో టీడీపీ జాగ్రత్త.. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాట్ కామెంట్స్

Breaking: అమరావతి బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకించిన వైసీపీ.. ఎంపీల వాకౌట్

Next Story