- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (ఏ6), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (ఏ6), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెయిల్‌ను రద్దు చేసి, రెండు వారాల్లోగా కింది కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండటంతో పిన్నెల్లి సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు పిన్నెల్లి సోదరులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
ఈ లొంగుబాటు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. దానితోపాటు పోలీస్ యాక్ట్ 30ను అమలు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు. పలువురు వైసీపీ నాయకులకు ముందస్తు చర్యల్లో భాగంగా హౌజ్ అరెస్టు చేవారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు లొంగిపోవడంతో ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయోనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే.
Read More..
మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
కడప పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. మేయర్‌గా పాకా సురేశ్ ఎన్నిక






