కడప పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. మేయర్‌గా పాకా సురేశ్‌ ఎన్నిక

by Kema Shiva Kumar |

కడప (Kadapa) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కడప పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. మేయర్‌గా పాకా సురేశ్‌ ఎన్నిక
X

దిశ, వెబ్‌డెస్క్: కడప (Kadapa) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్‌గా పాకా సురేశ్ (Paka Suresh) ఎన్నికైనట్లుగా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ (Athiti Singh) ప్రకటించారు. ఇవాళ మేయర్ ఎన్నికకు మొత్తం 38 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మరోవైపు ఈ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. దీంతో కడప మేయర్‌గా 47వ డివిజన్ కార్పొరేట్ పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మేయర్ పదవి ఇశించి భంగపడిన 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున్ (Mallikarjun) మేయర్ ఎన్నికకు గైర్హాజరయ్యారు.

ఇక, కళ్యాణదుర్గం (Kalyandurgam) మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఛైర్‌పర్సన్‌గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటు వేశారు.

Next Story