- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు : మంత్రి నారా లోకేష్
కేంద్ర బడ్జెట్ 2026 ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన లాభాలు చేకూరనున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశం వేగవంతమైన అభివృద్ధి, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా సమతుల్యంగా కేంద్రబడ్జెట్ ను రూపొందించినందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు.
కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతాం
ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన లాభాలు చేకూరనున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ కారిడార్, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం, పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకుని పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, ఆంధ్రప్రదేశ్ తదుపరి దశ వృద్ధికి బలం చేకూర్చడం లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు.
నిర్మలమ్మ బడ్జెట్ చాలా బాగుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Next Story






