నిర్మలమ్మ బడ్జెట్ చాలా బాగుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 13:01:32  IST  )

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వరుసగా 9వ సారి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ చాలా బాగుందని ప్రశంసలు కురింపించారు.

నిర్మలమ్మ బడ్జెట్ చాలా బాగుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వరుసగా 9వ సారి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ చాలా బాగుందని ప్రశంసలు కురింపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్లో నిర్మలమ్మ దేశ అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. విద్య, ఆరోగ్యం, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో విదేశీ యాత్రలపై పన్ను తగ్గించడం వల్ల పౌర విమానయాన రంగానికి మరింత ఊతమిస్తుందని తెలిపారు. అలాగే పౌర విమానాల స్పేర్ పార్ట్స్ పై కూడా పన్ను తగ్గించడం, కొబ్బరి పంటకు ప్రాధాన్యమివ్వడం హర్షణీయమన్నారు. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న కొబ్బరి.. కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉద్దానం ప్రాంతానికి పూర్వవైభవం

పెట్టుబడులు, సంస్కరణలపై దృష్టి పెట్టం ద్వారా దేశానికి మరింత ప్రగతిని, సుస్థిరమైన అభివృద్ధిని తీసుకురాగలిగామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యుల్ని ఆకట్టుకుందన్నారు. బడ్జెట్లో పేర్కొన్న ప్రతీ అంశం దేశ ప్రగతిని సూచిస్తుందన్నారు. ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు, టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేక కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటునివ్వడం ఇలా అనేక అంశాలు బడ్జెట్లో ఉన్నాయని వివరించారు. గతంలో కంటే 2026-27కి కేంద్రం రూ.12.2లక్షల కోట్ల పెట్టుబడులను పెంచి తన విజన్ ఏంటో స్పష్టం చేసిందన్నారు. ఆ పెట్టుబడులు తాను మంత్రిగా వ్యవహరిస్తున్న పౌర విమానయానం, ఎయిర్పోర్టులతో పాటు, రైల్వేలు, రోడ్లు, పోర్టులు, లాజిస్టిక్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లపై ఉన్నాయన్నారు. ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలన్నది గొప్ప ఆలోచన అని కొనియాడారు. దీనివల్ల బాలికల విద్య మరింత పెరుగుతుందన్నారు. ఈ బడ్జెట్లో ఏపీకి సింహభాగం కేటాయింపులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కొబ్బరి ప్రోత్సాహక పధకం ద్వారా ఉద్దానం ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు : మంత్రి నారా లోకేష్


Next Story