- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవ్ ఆల్, సర్వ్ ఆల్..సత్యసాయి నినాదం : ప్రధాని నరేంద్రమోదీ
పవిత్రభూమి పుట్టపర్తికి రావడం సంతోషంగా ఉందన్నారు. సత్యసాయి ప్రేమ, సేవ మార్గాలను అందరం అనుసరించాలని పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ ఆయన మహాసమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంకు చేరుకుని సత్యసాయిపై రూ.100 నాణెం, స్టాంప్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పవిత్రభూమి పుట్టపర్తికి రావడం సంతోషంగా ఉందన్నారు. సత్యసాయి ప్రేమ, సేవ మార్గాలను అందరం అనుసరించాలని పిలుపునిచ్చారు. సత్యసాయిది ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన అని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారన్నారు. మనిషి జీవితంలో సేవ చాలా ముఖ్యమని బాబా చెప్పేవారని, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది ఆయన నినాదమని తెలిపారు. సత్యసాయి సందేశం పుస్తకాలు, ప్రవచనాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఒక్కరూ అనుసరించి, ఆచరించి ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
మానవ సేవే మాధవ సేవగా భావించే సత్యసాయిబాబు మనందరికీ స్ఫూర్తి అని తెలిపారు. పేదలకు ఆపదవస్తే ఆదుకోవడంతో బాబా సేవాదళ్ ముందుంటుందని కితాబిచ్చారు. గుజరాత్ లో భూకంపం సంభవించినపుడు ఆయన సేవాదళ్ సేవలందించిందని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు దేశ, విదేశాలకు విస్తరించాయని తెలిపారు.
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వికసిత్ భారత్ గా దేశం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. పేదలకు అనేక పథకాలు అందించడంతో పాటు.. గో సంరక్షణ కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. సత్యసాయిబాబా స్ఫూర్తితో వోకల్ ఫర్ లోకల్ నినాదంతో మనమంతా ముందుకు సాగాలని మోదీ సూచించారు. మన ఉత్పత్తులను మనమే ప్రమోట్ చేసుకోవాలన్నారు.
Read More..
శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ సేవలు అనిర్వచనీయమైనవి : ప్రధానమంత్రి
సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి






