- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ సేవలు అనిర్వచనీయమైనవి : ప్రధానమంత్రి
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ప్రధానమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొన్నప్పుడు సమస్యను పరిష్కరించడానికి సుమారు 3వేల కిలోమీటర్ల మంచినీటి పైపులైన్లను సత్యసాయిబాబా ఆధ్వర్యంలో వేయించారని గుర్తు చేశారు. ఒడిస్సాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో అందిస్తున్నారన్నారు. సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలలో ఉచిత వైద్యం అందిస్తారన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను బోధిస్తూ వారిని విద్యావంతులను చేస్తున్నారన్నారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయడం గొప్ప విషయం అన్నారు. సత్యసాయిబాబా ట్రస్ట్ చేస్తున్న సేవలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోందని పేర్కొన్నారు.
ఆడపిల్లల భవిష్యత్తుకు పునాదులు
సుకన్య సమృద్ధి యోజనా పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఆడపిల్లల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం పునాదులు వేస్తోందన్నారు. వారణాసిలో 27వేల సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచామన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వేలాది ఖాతాలను తెరవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
100 కోట్ల మందికి సోషల్ సెక్యూరిటీ
2014 తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. వాటి ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2014లో 25 కోట్ల మంది సోషల్ సెక్యూరిటీ పరిధిలో ఉన్నారని గుర్తు చేశారు. ఆ సంఖ్య నేడు వంద కోట్లకు చేరుకుందన్నారు. దేశంలో అమలు చేస్తున్న గరీబ్ కల్యాణ్ యోజనా కావొచ్చు, సోషల్ సెక్యూరిటీ పెంచే పథకాలు కావొచ్చు విదేశాల్లో కూడా చర్చకు వస్తున్నాయని వెల్లడించారు.
గోవులతో కుటుంబాలకు స్థిరత్వం
శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాల్లో భాగంగా 100 గోవులను దానం చేసే అవకాశం తనకు లభించిందన్నారు. భారతీయ పరంపరలో గోవులను జీవనం, కరుణ, సమృద్ధికి ప్రతీకగా భావించడం జరుగుతుందన్నారు. గోవులు కుటుంబాల ఆర్థిక భద్రత, పోషణ, స్థిరత్వం పొందడంలో సహకరిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 400లకు పైగా గిర్ గోవులను వారణాసిలో పంచామని తెలిపారు. ఇప్పుడు గోవులు, దూడల సంఖ్య కలిపి 1700లకు చేరుకుందన్నారు. ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా గోపోషణ ఆదర్శనీయంగా సాగుతోందని తెలియజేశారు.
లోకల్ ఫర్ వోకల్
శ్రీ సత్యసాయిబాగా జన్మదినం ప్రేరణతో లోకల్ ఫర్ వోకల్ సంకల్పాన్ని బలోపేతం చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. తద్వారా ఎకానమీని బలోపేతం చేద్దామని కోరారు. లోకల్ ఎకానమినీ బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుందని తెలిపారు. అందుకే ప్రతిఒక్కరూ శ్రీ సత్యసాయి బాబా ప్రేరణతో రాష్ట్ర నిర్మాణంలో భాగమవుదామని కోరారు. నిజానికి ఇక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తి మాటలో కరుణ, ఆలోచనలో శక్తి, చేతల్లో సామర్థ్యం తనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. నిరాశ, నిస్సహాయత నెలకొన్న చోట మీరంతా నిలబడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
Read More..
లవ్ ఆల్, సర్వ్ ఆల్..సత్యసాయి నినాదం : ప్రధాని నరేంద్రమోదీ
సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి






