సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి

by Thanuru Gopichand |   (  Updated:2025-11-19 08:34:12  IST  )

ఒకే ధర్మాన్ని ఆచరించాలి.. ఒకే ఆత్మను విశ్వసించాలనేది శ్రీ సత్యసాయిబాబా (Sri Satya Saibaba) సందేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు.

సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకే ధర్మాన్ని ఆచరించాలి.. ఒకే ఆత్మను విశ్వసించాలనేది శ్రీ సత్యసాయిబాబా (Sri Satya Saibaba) సందేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని బాబా తెలిపారన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన కాలంలో ప్రత్యక్ష దైవ స్వరూపంగా ప్రజలకు ప్రేమ, సేవ, శాంతి, సౌభాగ్యం మార్గాన్ని చూపించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన బోధనలు ప్రేమ, సేవా సిద్ధాంతానికి, సేవా కార్యక్రమాలకు మరింత శక్తి నింపాయన్నారు. మనందరం కలిసి బాబా బోధించిన ప్రేమ, సేవ, ధర్మం, శాంతి సిద్ధాంతాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. సత్యసాయి ట్రస్ట్, సేవాదళ్, భక్తులు అందరూ కలిసి భవిష్యత్ తరాలకు ఆయన మార్గాన్ని చేరవేయాలని, సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం సత్యసాయి అని.. సత్యసాయికి సమ్మోహన శక్తి ఉందని.. ఎంతో మంది నాస్తికులను ఆధ్యాత్మికతవైపు మళ్లించారని ముఖ్యమంత్రి అన్నారు. మానవసేవే.. మాధవ సేవ అని సత్యసాయి బాబా భావించేవారన్నారు. సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. భారత ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రపంచానికి చూపించాలని కోరుకుంటున్నారన్నారు. అందులో భాగంగా ఆయుర్వేదం, యోగ, ధ్యానం వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొననారు. ఉత్సవాల్లో భాగంగా ప్రపంచ ప్రజలకు శాంతి, సేవా సందేశాన్ని అందించడంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేసే శక్తి తనకు లభించాలని ఆకాంక్షించారు.

Read More..

ఆ కేంద్ర పథకానికి సత్యసాయి బాబానే అంకురార్పణ చేశారు: పవన్

శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ సేవలు అనిర్వచనీయమైనవి : ప్రధానమంత్రి

Next Story