- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహానాడులో హాట్ టాపిక్‌గా లోకేశ్ పోస్ట్.. ఆ భారీ ప్రకటన వెనుక ఏముంది?
తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’లో ఇప్పుడు అందరి దృష్టి యువనేత నారా లోకేశ్ పైనే నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’లో ఇప్పుడు అందరి దృష్టి యువనేత నారా లోకేశ్ పైనే నెలకొంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేయబోతున్న తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఆయన చేయనున్న ఓ ‘భారీ ప్రకటన’ (Big Announcement) ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
లోకేశ్ ఏమన్నారంటే..?
‘ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నా తొలి ప్రసంగం ఉండబోతోంది. ఓ భారీ ప్రకటన చేయబోతున్నాను.. వేచి చూడండి’ అని నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పార్టీ శ్రేణుల్లో, యువతలో ఉత్కంఠ పెరిగింది. అసలు లోకేశ్ ఏం ప్రకటించబోతున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లు
లోకేశ్ చేసిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ‘ఆల్ ది బెస్ట్ లోకేశ్ గారు.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ, మహానాడు 2026 శుభాకాంక్షలు సార్! మీరు చేయబోయే మొదటి ప్రసంగం, ఆ పెద్ద ప్రకటన కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. జై టీడీపీ’ అంటూ కామెంట్ల రూపంలో తమ మద్దతును, ఉత్సాహాన్ని తెలియజేస్తున్నారు.
ఘనంగా ప్రారంభమైన మహానాడు
ఇదిలా ఉండగా, రెండు రోజుల పాటు సాగే టీడీపీ మహానాడు కార్యక్రమాలు బుధవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన వేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం 10:10 గంటలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉపన్యాసంతో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.






