- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో పసుపు సందడి.. ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం ‘మహానాడు’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం ‘మహానాడు’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ‘పసుపు పండగ’గా పిలుచుకునే ఈ వేడుకలు రెండు రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో జరగనున్నాయి. ముందుగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) వద్ద ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉదయం 10:10 గంటలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభోపన్యాసంతో మహానాడు కార్యక్రమాలు అధికారికంగా మొదలయ్యాయి.
డిజిటల్ విప్లవం: క్లస్టర్లతో అనుసంధానం
ఈసారి మహానాడును సరికొత్త సాంకేతికతతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, మంగళగిరి ప్రధాన వేదికతో అనుసంధానించారు. ఈ డిజిటల్ విధానం ద్వారా క్లస్టర్లలోని క్షేత్రస్థాయి కార్యకర్తలు నేరుగా కేంద్ర నాయకత్వంతో సంభాషించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలోనే నేతలు హాజరవుతుండగా, పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రధాన వేదిక నుండి పాల్గొంటున్నారు.
రెండు రోజుల్లో 20 కీలక తీర్మానాలు..
రెండు రోజుల పాటు సాగే ఈ మహానాడు వేదికగా మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర్మానాలు 10 , తెలంగాణ తీర్మానాలు 4 , ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1 ప్రవేశపెట్టనున్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ దిశానిర్దేశంపై ఈ రెండు రోజుల్లో సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి.






