‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’.. మహానాడు వేదికగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-05-27 07:15:15  IST  )

టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది.

‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’.. మహానాడు వేదికగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మహానాడు ప్రజలందరికీ ఒక భరోసానిచ్చే ఒక ఉత్సవం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఏదో మీటింగ్ పెట్టుకోని మహానాడును డైవర్ట్ చేయడానికి వైసీపీ భావిస్తున్నట్టు ఆయన మండిపడ్డారు. నీ లాంటి వాళ్లు ఎన్ని కుట్రలు చేసిన ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయాలేరని అన్నారు. గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ఏపీ ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధిపై గొడ్డలి వేటుతో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు.. గొడ్డలి వేట్లు కాదు, యువతకు కావాల్సింది ఉద్యోగాలు.. గొడ్డలి పోట్లు కాదు.. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు.. జంతు బలులు కాదన్నారు. రక్త చరిత్ర రాసేవారు.. స్వర్ణాంధ్ర చరిత్రను లికించలేరు.. అని తెలిపారు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ, టీడీపీ బోత్ ఆర్ నాట్ సేమ్..

‘వేట కొడవళ్ల నుంచి గొడ్డలి దాకా ఎదగడమే వారి విధానం.. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం.. వైసీపీ, టీడీపీ బోత్ ఆర్ నాట్ సేమ్’ అని డైలాగ్ చెప్పారు. ఇది అందరి మనసుల్లో ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పుట్టుక, ప్రస్థానం, ప్రయాణం.. అన్నీ అద్భుతాలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీల కంటే బెస్ట్‌ని ఏపీకి తీసుకొస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా దేశానికి గౌరవం.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం.. పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా అని చెప్పుకొచ్చారు. క్యాడర్‌ను గౌరవంగా చూసుకోవాలి. సముచిత స్థానం కల్పించాలి. ఏ స్థాయి నాయకుడైన పార్టీ ఫస్ట్.. అలాగే క్యాడర్‌ను పట్టించుకోకపోతే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 280 ప్రాజెక్టులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పనిచేసేవాళ్లు రాణిస్తారు.. పని చేయకపోతే వెనుకబడి పోతారని అన్నారు.

మహానాడులో హాట్ టాపిక్‌గా లోకేశ్ పోస్ట్.. ఆ భారీ ప్రకటన వెనుక ఏముంది?

నామినేటెడ్ పదవుల భర్తీపై మహానాడులో స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Next Story