- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేటెడ్ పదవుల భర్తీపై మహానాడులో స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ మహానాడు వేదికగా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తమ ఐక్యతను చాటుకుని, మన భావజాలాన్ని ప్రతిబింబించే వేదిక మహానాడు అని టీడీపీ (TDP) ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మన భవిష్యత్తు కార్యచరణను రూపుదిద్దుకునే వేదిక అన్నారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగల్భంలో కలిసిపోయాయని టీడీపీ ఒక్కటే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగి కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ మహానాడు ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన.. అవకాశాలు రాలేదని కార్యకర్తలు ఎవరూ బాధపడవద్దన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు ఇ్చచామని, భవిష్యత్తులోనూ పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి అలాంటి వారందరికీ పదవులు వస్తాయని ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం దక్కబోతున్నదని భరోసా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం మనకు ఉందని అలాగే భవిష్యత్ భరోసా కల్పించే నాయకత్వం లోకేశ్ రూపంలో ఉందన్నారు. ఈ ఇరువురుని అడుగుజాడల్లో నడిస్తే కచ్చితంగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్-2047 రూపొందించారని చెప్పారు. పార్టీలో 63 శాతం యువతకు ప్రాధాన్యత దక్కుతోందన్నారు.
‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’.. మహానాడు వేదికగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు






