కేసీఆరే గెల‌వాల‌ని 90 శాతం వైసీపీ క్యాడ‌ర్ కోరుకుంటోంది !

by velandi.Saikiran |   (  Updated:2026-01-07 07:34:01  IST  )

వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి, గులాబీ పార్టీ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 80 నుంచి 90 శాతం గులాబీ క్యాడర్, ఏపీలో వైసీపీ పార్టీ గెలవాలని కోరుకుంటోందని వెల్లడించారు. అదే సమయంలో 80 నుంచి 90 శాతం వైసీపీ కార్యకర్తలు కూడా తెలంగాణలో గులాబీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నార‌ని స్పష్టం చేశారు.

కేసీఆరే గెల‌వాల‌ని 90 శాతం వైసీపీ క్యాడ‌ర్ కోరుకుంటోంది !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైసీపీ క్యాడర్ కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి ( Kethireddy Venkatarami Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి, గులాబీ పార్టీ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. 80 నుంచి 90 శాతం గులాబీ క్యాడర్, ఏపీలో వైసీపీ పార్టీ గెలవాలని కోరుకుంటోందని వెల్లడించారు. అదే సమయంలో 80 నుంచి 90 శాతం వైసీపీ కార్యకర్తలు కూడా తెలంగాణలో గులాబీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నార‌ని స్పష్టం చేశారు.

ముందు నుంచి కేటీఆర్ (KTR ), కేసీఆర్ లతో (KCR ) వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Ys Jaganmohanreddy) మంచి సంబంధాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి షాకింగ్ నిజాలను బయటపెట్టారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు గురువు శిష్యులని, అందుకే వాళ్ళను ఓడించాలని వైసీపీ, గులాబీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఏపీలో వైసీపీ క్యాడర్ పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు. అటు గులాబీ పార్టీ కార్యకర్తల పైన రేవంత్ రెడ్డి కూడా కేసులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇరు పార్టీలకు న్యాయం జరుగుతుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు కేతిరెడ్డి ( Kethireddy Venkatarami Reddy ). దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్ల‌కే ప‌రిమిత‌మై, అధికారం కోల్పోయింది. అటు జ‌గ‌న్ పార్టీకి 11 సీట్లే వ‌చ్చాయి.

Read More.. కేటీఆర్ ఖమ్మం పర్యటన వేళ మరో షాక్

మాజీ మంత్రి కేటీఆర్ ర్యాలీలో జగన్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

Next Story