- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కేటీఆర్ ర్యాలీలో జగన్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్
మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన(Former Minsiter Ktr)లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం(Kusumanchi Mandal) నాయకన్‌గూడెం(Nayakangudem)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్(BRS Working President KTR) ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ జగన్(Ys Jagan) ఫొటోతో పాటు వైసీపీ(Ycp) జెండాలు కలకలం రేపింది. కేటీఆర్ ర్యాలీలో జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ జెండాలతో జై జగన్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మొన్న అక్కడ సైతం..
కాగా తెలంగాణలో ఇటీవల జగన్ , కేటీఆర్ తెలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్, జగన్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. దీంతో రెండు పార్టీల కార్యక్రమాల్లో ఇద్దరి నేతలు ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫొటోలు వెలిశాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Read More.. కేసీఆరే గెలవాలని 90 శాతం వైసీపీ క్యాడర్ కోరుకుంటోంది !






