కేటీఆర్ ఖమ్మం పర్యటన వేళ మరో షాక్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 04:49:27  IST  )

కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రోజే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.

కేటీఆర్ ఖమ్మం పర్యటన వేళ మరో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR) ఖమ్మం జిల్లా పర్యటన రోజే ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. ఇవాళ మరో ముగ్గురు గులాబీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఐదుగురు మహిళా కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురు, అది కూడా కేటీఆర్ పర్యటన రోజే హస్తం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సన్మానించేందుకు కేటీఆర్‌ ఖమ్మం వస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. వీరితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read More..

TG: అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఇవే

Next Story