TG: అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఇవే

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 04:51:21  IST  )

అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ముగిసాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ నిరవధికంగా వాయిదా వేశారు.

TG: అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ముగిసాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ ఐదు రోజుల పాటు సాగిన సమావేశాలు మంగళవారం రాత్రి ముగిసాయి. మొత్తం ఐదు రోజులు జరగ్గా 13 బిల్లులు ఆమోదించారు. ఇందులో ప్రభుత్వం రెండు తీర్మానాలు చేసింది. నాలుగు అంశాలపై స్వల్ప కాలిక అంశాలపై చర్చించారు. శాసనమండలి కూడా ఐదు రోజుల పాటు సాగింది. శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ మొత్తం ఐదు రోజులు 40 గంటల 45 నిమిషాలు జరిగినట్లుగా స్పీకర్​ ప్రకటించారు. ఈ సమావేశాల్లో ఉపాధి హామీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండు తీర్మాణాలు చేసి కేంద్రానికి పంపించారు. 66 మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు. 82 మంది సభ్యులు ప్రశ్నోత్తరాల్లో భాగంగా తమ ప్రశ్నలను ప్రభుత్వంపై సందించారు. గత నెల 29 సోమవారం అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మొదటి రోజున దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం సభలో జీరో అవర్ ను చేపట్టారు. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ దగ్గరకు వెళ్లి పలకరిచండం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే సంతాప తీర్మానాల మధలోనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడంపై అధికార ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. సభలో మూడుంటే మూడు నిమిషాలు కేసీఆర్ లేకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో మూసీ ప్రక్షాళన మీద అధికార, విపక్షాల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. సీఎం విపక్షాల తీరును ఎండగట్టారు. మరోవైపు సభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా.. ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సభ నుంచి వాకౌట్ చేసింది.

13 బిల్లులకు ఆమోదం

సభలో 13 బిల్లులపై చర్చించి ఆమోదించారు. దీనిలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ రెండో సవరణ బిల్లు, మున్సిపల్​ చట్ట సవరణ, పంచాయతీరాజ్​చట్ట సవరణ చేశారు. తెలంగాణ ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు, తెలంగాణ మోటార్ వెహికిల్స్ టాక్సేషన్ బిల్లులు సభలో చర్చించారు. అనంతరం ఉపాథి హామీ పథకంపై తీర్మానంపై చర్చ జరిగింది. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సభ తీర్మానం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్నా జిల్లాలపై , పోవలరం నల్లమల సాగర్​ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వోద్దు అంటూ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించారు. ఉపాధి హామీని వ్యతిరేకిస్తూ పాత చట్టాన్ని పునరుద్దరించాలని తీర్మానించారు. కీలకమైన అంశం నీటిపారుదల రంగంపై సభలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నదీజలాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి, కృష్ణా నదీ జలాలపై ప్రసంగించారు. పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి ఇవ్వాలని సభలో తీర్మానం చేశారు. శాసనసభలో నాలుగో రోజు రికార్డు స్థాయిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కొనసాగింది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్థావించారు.

Read More..

TG Municipal Elections: అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసేది ఇలాగే!

ఎన్నికల వేళ బయటపడ్డ బ్లండర్ మిస్టేక్స్.. అధికారుల తీరుపై పార్టీలు ఆగ్రహం

Next Story