- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Municipal Elections: అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసేది ఇలాగే!
రాబోయే మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. శాసనసభలో గంట పాటు ఇద్దరు నేతలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. మున్సిపాల్టీల్లో వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్ల అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ, ఎన్నికల నిర్వహణపైనా చర్చించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విషయంలో డివిజన్, వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ప్రతి వార్డు, డివిజన్ నుంచి ఆరుగురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒకసర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల పేర్లను డీసీసీలు, టీపీసీసీలకు పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుంది.
8న గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం
మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ చర్చించారు. దీంతోపాటు ప్రధానంగా 8న గాంధీభవన్ లో జరిగే టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై నేతల మధ్య చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని, పథకం పేరు మార్చడంపై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి రేవంత్ రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ చర్చించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కృష్ణా, గోదావరి జలాల పీపీటీ విషయంపై ఇరువురు చర్చించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశంలో ప్రభుత్వం ప్రజలకు మంచి సమాచారాన్ని అందించిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Read More..
ఎన్నికల వేళ బయటపడ్డ బ్లండర్ మిస్టేక్స్.. అధికారుల తీరుపై పార్టీలు ఆగ్రహం






