- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొదిలి ఘటన.. నారా లోకేశ్ వర్సెస్ అంబటి రాంబాబు
పొదిలి ఘటనపై మంత్రి నారా లోకేశ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: పొదిలి(Podili)లో వైఎస్ జగన్(Ys Jagan) పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సాక్షి ఛానెల్‌లో మహిళలను కించపర్చారంటూ, క్షమాపణలు చెప్పాలంటూ స్థానిక మహిళలను ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నాయకులు దాడి చేశారు. వారిని అడ్డుకోబోయిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. టీడీపీ(Tdp) వర్సెస్ వైసీపీ(Ycp)గా మారింది. పొదలి ఘటనపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో వైసీపీ సైకోల దాడిని ఖండిస్తున్నామన్నారు.మహిళలు, పోలీసులపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. దాడికి జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు.
అయితే ఇందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నారా లోకేశే చెప్పులు వేయించారని వ్యాఖ్యానించారు. పొదిలి ర్యాలీని లోకేశ్ మానిటరింగ్ చేశారన్నారు. నలుగురు మహిళలతో చెప్పులు వేయించారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని, తూటాలు పేల్చాల్సిన పరిస్థితులు వస్తాయని అంబటి రాంబాబు హెచ్చరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులతో వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త లక్ష్మణరావును గురువారం జగన్ పరామర్శిస్తారని చెప్పారు పొగాకు రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ కాన్యాయ్‌పై దాడికి యత్నించారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Read More..






