Nara Lokesh: మరో హామీ నెరవేరింది.. నారా లోకేష్ గుడ్ న్యూస్

by Thanuru Gopichand |   (  Updated:2025-06-11 12:55:26  IST  )

'విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు.

Nara Lokesh: మరో హామీ నెరవేరింది.. నారా లోకేష్ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణుల కు కానుకగా తల్లికి వందనం (Talliki Vandanam) పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం...' అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతో షం..చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందుతుంది అని ఆయన తెలిపారు. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. అన్నా రు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ (Super Six) హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది అని ఆయన పేర్కొన్నారు.

Read More..

Talliki vandanam: రేపే.. తల్లుల ఖాతాల్లోకి రూ.15,000.. గుడ్​న్యూస్​ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఆ ఆర్థిక సాయం పెంపు

Next Story