ఏపీ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఆ ఆర్థిక సాయం పెంపు

by Malleboina Mahesh |   (  Updated:2025-06-11 12:16:06  IST  )

సరిగ్గా ఏడాది క్రితం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏపీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ..

ఏపీ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఆ ఆర్థిక సాయం పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా ఏడాది క్రితం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) రాష్ట్రంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ.. ప్రజలు, ఉద్యోగులు, కార్మికుల రక్షణతో పాటు వారిని అన్ని విధాలుగా అదుకునేందుకు అన్ని సంస్థలతో కలిసి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీఎస్‌ఆర్టీసీ‌ (APSRTC)లో పని చేస్తున్న, పదవి విరమణ పొందిన ఉద్యోగులు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని (Financial assistance) రూ. 15 నుంచి రూ. 25 వేలకు పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం (RTC management) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డబ్బులు ఆర్టీసీలో గతంలో పని చేసిన, ప్రస్తుతం చేస్తున్న వారి మరణం తర్వాత అంత్యక్రియల ఖర్చుల కోసం ఆర్టీసీ యాజమాన్యం ఎప్పటి నుంచో ఇస్తుంది. అయితే తాజా నిర్ణయంతో.. గతంలో రూ. 15 సాయం అందుకున్న వారి కుటుంబ సభ్యులకు మిగిలిన 10 కూడా త్వరలోనే చెల్లించనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. కార్మికులు, ఉద్యోగుల కోసం సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read More..

పొదిలి ఘటన.. నారా లోకేశ్ వర్సెస్ అంబటి రాంబాబు

Next Story