- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా...
త ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలపాలనే

గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కాలంతో పోటీ పడుతున్నారు. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేయడం పైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు . ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి బాట పట్టించడానికి ఏడాది నుండి అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు.
ఏడాదిలో గత ఆర్థిక సంవత్సరం 2024-25 లో జీఎస్‌డీపీ వృద్ధిరేటులోనూ, తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించి 8.21 శాతం వృద్ధిరేటుతో దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో, తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు- కార్య క్రమాల అమలు శాఖ ఎంవోఎస్‌పీఐ వెల్లడించడం అంటే వేగంగా రాష్ట్రం రెండంకెల దిశగా దూసుకెళుతుంది అనడానికి రుజువు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలన ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరు విశ్లేషించినప్పుడు ఏడాది నుండి గొప్ప పరిపాలన అందించడానికి కృషి చేస్తున్నదనీ, రాష్ట్ర ప్రజలు పెట్టుకొన్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తున్నదనీ చెప్పాలి.
ఏడాదిలోపే 8.21 శాతం వృద్ధి రేటు..
గత ఐదేళ్ల పాలనలో దగాపడ్డ మధ్య తరగతి, అట్టడుగు ప్రజలు వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్య సాధన కోసం సీఎం చంద్రబాబు విలక్షణమైన ప్రజా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు.. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏడాదిలోనే రాష్ట్రం 8.21 శాతం వృద్ది సాధించడం గర్వించదగ్గ విషయం. కేంద్రం నివేదిక ప్రకారమే వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధిరేటు కేవలం 6.19 శాతం మాత్రమే కాగా 2024-25లో 8.21 శాతం సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయం. ఒక్క ఏడాదిలోనే 2.02 శాతం పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన విధానాలతో మెరుగైన ఫలితాలతో రాష్ట్రం గాడిలో పడింది.
ఏడాదిలోనే ఎన్నో విజయాలు
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో విజయాలు సాధించింది ప్రభుత్వం. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సామాజిక పింఛన్ల పెంపు పథకం. ఆర్థిక కష్టాలకు వెర వకుండా సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు అప్పటివరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే పెంపును వర్తింపజేసి -జులై 1న పింఛను కింద వీరందరికి రూ.7 వేల చొప్పున ఇచ్చి తన ఉదారతను చాటుకొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్ల కోసం ఖర్చు నెలకు రూ.1,939 కోట్లు చెయ్యగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే అతిపెద్ద ఎన్ఠీఆర్ భరోసా సామాజిక భద్రత పథకం కింద నెలకు రూ.2,834.కోట్లు ఖర్చు చేస్తున్నది. ఒక్క పింఛన్లకే ఏడాదికి రూ.34 వేల కోట్లు.. ఐదేళ్ళల్లో రూ.1.70 లక్షల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నది కూటమి ప్రభుత్వం.
ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు..
జగన్ నిలిపేసిన అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి రాగానే 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. సగటున రోజుకు 3 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్నది. దీపం-2 పథకం ప్రారంభించి 2025 మార్చి నాటికి తొలి విడత కింద 1.15 కోట్ల మందికి ఉచిత సిలిండర్ అందించారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు రూ. 2,684 కోట్ల వ్యయం కాగా ఐదేళ్లలో మొత్తం ప్రభుత్వం పై రూ.13,423 కోట్ల భారం పడనుంది. మూడో విడత నుంచి సిలిండర్‌కి అయ్యే సొమ్మును ముందుగానే లబ్ధి దారుల ఖాతాలో జమ చేస్తున్నారు.16,347 ఉపాధ్యాయ నియామకాలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యగా. జగన్ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. గుంతలమయమైన రోడ్ల వల్ల జగన్ పాలనలో రోడ్ల ప్రమాదాల్లో 43 వేల మంది మృతి చెందారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 వేల కి.మీ రోడ్లు మరమ్మత్తులు చేశారు.
పేదరికాన్ని నిర్మూలించడం కోసం..
ఇలా ముక్కోణపు వ్యూహంతో ఏపీ ముందుకు అడుగు వేస్తోంది. భవిష్యత్ అవసరాల్ని అందుకునే భారీ ప్రణాళికలు ఇప్పటికే ఉన్నాయ్. కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయి. రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖపట్టణాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, పి4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని జీరో పావర్టీ సమూలంగా నిర్మూలించాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 2047 విజన్ సాకారం కోసం ఆయన నిర్దే శించుకున్న పది సూత్రాల్లో సున్నా స్థాయికి పేదరిక నిర్మూలన ఒకటి.
(ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా)
నీరుకొండ ప్రసాద్
98496 25610
Read More..
Talliki vandanam: రేపే.. తల్లుల ఖాతాల్లోకి రూ.15,000.. గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం






