Talliki vandanam: రేపే.. తల్లుల ఖాతాల్లోకి రూ.15,000.. గుడ్​న్యూస్​ చెప్పిన ఏపీ ప్రభుత్వం

by Thanuru Gopichand |   (  Updated:2025-06-11 12:56:18  IST  )

ఏపీలోని విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్​చెప్పింది. రేపు తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

Talliki vandanam: రేపే.. తల్లుల ఖాతాల్లోకి రూ.15,000.. గుడ్​న్యూస్​ చెప్పిన ఏపీ ప్రభుత్వం
X

నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం

లబ్దిదారుల ఖాతాల్లో రూ,8745 కోట్ల నిధులు

67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ది

సూపర్​సిక్స్​పథకాల్లో మరో హామీ అమలు

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా నిధులు విడుదల

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీలోని విద్యార్థులకు (Students) సర్కారు గుడ్ న్యూస్​ చెప్పింది. రేపు తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లో రూ,8745 కోట్ల నిధులు ప్రభుత్వం జమచేయనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రేపు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు (chandrababu) ప్రకటించిన సూపర్ 6 హామీలలో ‘తల్లికి వందనం’ పథకం కూడా ఒకటి. తాజాగా ఈ పథకం ప్రారంభానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ పథకం అమలుపై ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు నారా లోకేష్‌, పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లికి వందనం,

విద్యార్థుల సంఖ్య, నిధులపై సుదీర్భంగా చర్చించినట్లు సమాచారం. ఈ నెలలోనే తల్లికి వందనం ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకు రూ.15,000 చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పాఠశాల విద్యాశాఖ డేటాను గ్రామ, వార్డు సచివాలయాల సమాచారం తో సరిపోల్చుకుంది. గతంలో సేకరించిన డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో విద్యార్థుల తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేశారు. అదే పథకాన్ని మరింత మెరుగ్గా, పారదర్శకంగా కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. తల్లికి వందనం పేరుతో ఈ స్కీమ్​ను అమలు చేయనుంది. ఈ పథకం కింది ఒకటి నుంచి 12వ తరగతి చదవుతున్న విద్యా ర్థుల తల్లులు ఖాతాల్లో ఏడాదికి రూ. 15 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది చదువకునే పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. పాఠశాలలు మొదలు అవుతుండడంతో చాలా మంది విద్యార్థుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్తను చెప్పింది.

Read More..

Nara Lokesh: మరో హామీ నెరవేరింది.. నారా లోకేష్ గుడ్ న్యూస్

Next Story