పెద్దపులిని బంధించేందుకు సర్వం సిద్ధం.. భయంతో ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-06 13:47:20  IST  )

తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్ మొదలైంది.

పెద్దపులిని బంధించేందుకు సర్వం సిద్ధం.. భయంతో ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్ మొదలైంది. కూర్మాపురంలో శుక్రవారం ఓ పూరిపాకలోకి పులి దూరినట్లు గ్రామస్తులు అటవీశాఖకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు పూరిపాక వద్దకు చేరుకున్నారు. పొలాల నుంచి ఇళ్లలోకి వచ్చినట్లు నిర్ధారించారు. పుణె రెస్క్యూ టీమ్‌తో ఆపరేషన్ ప్రారంభించారు. మత్తు ఇంజెక్షన్‌ గన్‌లు సిద్ధం చేసి.. బోనులు ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసేశారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భయంతో గ్రామస్తులు అందరూ ఇళ్లపైకి ఎక్కి వేచి చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్ రావు ముఖ్య ప్రకటన విడుదల చేశారు. గురువారం రాత్రి థర్మల్ డ్రోన్‌ల సాయంతో పులి లైవ్ లొకేషన్‌ను గుర్తించేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం జి.ఎర్రంపాలెం గ్రామ శివార్లలో చివరిసారిగా పులి పాదముద్రలు లభించిన ప్రాంతంలో అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు.

పాడుబడిన ఇంట్లో నక్కిన పులి.. గాండ్రింపులకు హడలిపోతున్న ప్రజలు

హమ్మయ్య.. ఆ పులిని పట్టేసుకున్నార్రోయ్..

Next Story