హమ్మయ్య.. ఆ పులిని పట్టేసుకున్నార్రోయ్..

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-06 13:45:18  IST  )

తూర్పు గోదావరి జిల్లా పెద్దపులి కథ సుఖాంతైమైంది.

హమ్మయ్య.. ఆ పులిని పట్టేసుకున్నార్రోయ్..
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి(East Godavari) జిల్లా పెద్దపులి కథ సుఖాంతైమైంది. పులిని పట్టుకునేందుకు పుణే బృందం రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్ అయింది. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి అధికారులు పెద్దపులిని పట్టుకున్నారు. దీంతో రైతులు, గ్రామస్తులు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పులిని బంధించేందుకు పూణే నుంచి వచ్చిన నిపుణులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా.. దానికి గన్ ద్వారా మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ సమయంలో పులి అక్కడ నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. ఏ సమయంలో అయినా పులి బయటకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ రెక్కి నిర్వహించి సక్సెస్‌ఫుల్‌గా పులి పట్టుకున్నారు.

పెద్దపులిని బంధించేందుకు సర్వం సిద్ధం.. భయంతో ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు

Next Story