ఏపీ, తెలంగాణ జల వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-05 10:50:14  IST  )

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఐక్యతగా ఉండాలని, విద్వేషాలు వద్దని సీఎం చంద్రబాబు అన్నారు..

ఏపీ, తెలంగాణ జల వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలు(Telugu States) విడిపోయినా ఐక్యతగా ఉండాలని, విద్వేషాలు వద్దని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు(Polavaram-Nallamala Sagar Project)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడవాలని సూచించారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం(Kaleswaram) కడితే.. అందుకు తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకుంటుందని తామెప్పుడు అభ్యంతరం చెప్పలేదని చెప్పారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, కాబట్టే అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. గోదావరి-పెన్నా, గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే మంచి జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More.. ఏపీ ఉల్లంఘనలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Read More... ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా.. ఇరుసుమండ గ్రామం ఖాళీ

Next Story