- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఉల్లంఘనలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ , ఏపీ మధ్య నీటి పంచాయితీ సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana), ఏపీ(Ap) మధ్య నీటి పంచాయితీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలవరం(Polavaram)-నల్లమల సాగర్(Mallanna Sagar) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం(Telgangana Government) సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ తరఫున వాదనలు కొనసాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది జగదీశ్ గుప్తా(Jagadish) వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్రం నుంచి అనుమతి ఉందని తెలిపారు. తెలంగాణ మాత్రం గోదావరి(Godavari)పై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాదనలు వినిపించారు. ఇందుకు సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అందరి అభిప్రాయాలతోనే తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు కదా అని సీజేఐ ప్రశ్నించారు. విచారణను వాయిదా వేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం వరద జలాలే వాడుకుంటామని చెబుతోందని, కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యపడదని వివరించారు. అంతేకాదు ఇందుకు సంబంధించి చాలా విషయాలు ముడిపడి ఉన్నాయని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం నియమించిన కమిటీ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు
అయితే ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ చేపట్టే ప్రాజెక్టు నివేదికపై కమిటీని ఏర్పాటు చేశారని తమరే చెబుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని వ్యాఖ్యానించారు. సివిల్ సూట్‌లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని ప్రశ్నించారు.
మధ్యంతర ఉపశమనం కల్పించాలి
అయితే మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరఫున సింఘ్వీ కోరారు. ఇందుకు సీజేఐ రిప్లై ఇస్తూ ఆంధ్రప్రదేశ్ కేవలం ప్రాజెక్టు నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి న్యాయపరిధి ఉంటుందని సీజేఐ తెలిపారు.
ఏపీ మరో లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు
ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరమేంటని ఏపీ మరో లాయర్ ముకుల్ రోహిత్గి ప్రశ్నించారు. ఏపీ ఇల్లు.. ఆ రాష్ట్రం కట్టుకోవాలంటే మిగిలిన వాళ్ల అభ్యంతరమేంటని నిలదీశారు. తన భూభాగంలో నిర్మించే ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుంటే అభ్యంతరం ఎందుకో చెప్పాలన్నారు. రాయలసీమలో కరువు ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లడానికే ప్రాజెక్టు ప్రతిపాదన అని ముకుల్ పేర్కొన్నారు. ఎక్కడా, ఏ ఉత్తర్వులు, తీర్పులు, ఉల్లంఘనలు ఈ ప్రాజెక్టులో లేవని ముకుల్ తెలిపారు.
అభ్యంతరాలను పరిగణించండి: సీజేఐ
ఇందుకు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐ సూచించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగదని ఇందుకు ముకుల్ సమాధానమిచ్చారు. దీంతో విచారణను ధర్మాసనం ఈ నెల 12కు వాయిదా వేసింది.
Read More..






