- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా.. ఇరుసుమండ గ్రామం ఖాళీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులను ఆరా తీశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ లకు ఫోన్ చేసి ప్రమాద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా మంటలను అదుపు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్, ఎంపీ హరీశ్, ఎమ్మెల్యే దేవరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామాన్ని పొగ కమ్మేయడంతో సహాయక చర్యలను వేగవంతం చేసి... ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించారు.
వందల సంఖ్యలో కొబ్బరిచెట్లు దగ్ధం
కాగా.. ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రమాదంతో మలికిపురం మండలంలో చెలరేగిన మంటలు క్రమంగా కొబ్బరిచెట్లకు అంటుకోవడంతో వందలాది చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. 100 అడుగుల మేర మంటలు ఎగసిపడటంతో ముందు జాగ్రత్తగా గ్రామస్తులు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా.. అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Read More... దేశంలో ఏ భాష ఎక్కువా, తక్కువ కాదు: సీఎం చంద్రబాబు
Read More... "ఏపీ, తెలంగాణ జల వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు"






