- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో ఏ భాష ఎక్కువా, తక్కువ కాదు: సీఎం చంద్రబాబు
దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. గుంటూరులో నిర్వహించిన తెలుగు మహాసభల్లో(Telugu Mahasabhalu) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఏ భాష ఎక్కువా, తక్కువ కాదన్నారు. మాతృభాషలో అభ్యసించిన వారే అత్యంత ప్రతిభావంతులవుతారని తెలిపారు. తెలుగు భాష కోసం కృషి చేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్(Andhra Saraswata Parishad) సేవలు అభినందనీయమని చెప్పారు. 4వ ప్రపంచ తెలుగు మహాసభలను మారిషస్‌లో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగేనని గుర్తు చేశారు. మాతృ భాషలో రాణిస్తే దేనిలోనైనా రాణించవచ్చని చెప్పారు. టెక్నాలజీతో భాష కనుమరుగు కావటం లేదు. భాషను కాపాడుకోవటం మరింత సులభం అవుతుందని తెలిపారు. త్యాగధనుల్ని జాతి నిరంతరం గుర్తించుకునేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
‘‘ఆత్మగౌరవం అని అన్న ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి ఆత్మవిశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత కూడా ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించే భాగ్యం కలిగింది. తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న ప్రజలందరి అభివృద్ధే నాకు ముఖ్యం. 30 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో ఐటీలో తెలుగువాళ్లు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావు అయితే.. ఐటీని అందిపుచ్చుకుని మన యువతకు, తెలుగు రాష్ట్రాలకు సంపద సృష్టించాం’’. అని చంద్రబాబు పేర్కొన్నారు.






