హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్.. విచారణకు రాకపోతే లీగల్ యాక్షన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-20 12:31:41  IST  )

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్.. విచారణకు రాకపోతే లీగల్ యాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో హైడ్రా పరిధిని దాటి జోక్యం చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ.. తమ పరిధిలో లేని అంశాల్లో ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి.. విచారణకు హాజరు కాని నేపథ్యంలో కఠిన చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల రక్షణ పేరుతో ఇప్పటికే పలు నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నేడు హైకోర్టు రంగనాథ్ కు కీలక ఆదేశాలతో పాటు హెచ్చరిక జారీ చేయడం చర్చనీయాంశమయింది.

నాలుగేళ్ల చిన్నారిపై దారుణం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం

Next Story