- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ నా నేల కాదా.. నా దేశం కాదా: పవన్ కల్యాణ్
తెలంగాణ తన నేల కాదా అని, తన దేశం కాదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ అన్నారు. జాతీయ సమగ్రత, సేన ప్రస్థానం పేరుతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు...

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) తన నేల కాదా అని, తన దేశం(Nation) కాదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్(Ap Deputy Cm Pawan Kalyan) అన్నారు. జాతీయ సమగ్రత, సేన ప్రస్థానం పేరుతో ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ యుతపై తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జరిగిన బలిదానాలు తనను కలిచివేశాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి 12 ఏళ్లు అయిందని, అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని పవన్ ఎద్దేవా చేశారు.
ఇంకా ఎన్నేళ్లు..
తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని, వారి ప్రాణ త్యాగాలను ఎన్నేళ్లకు గుర్తిస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అమరుల గౌరవార్థం హైదరాబాద్‌లో సభ పెట్టేందుకు పర్మిషన్ అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు. అమరులకు నివాళులర్పించేందుకు అనుమతి కావాలా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం తనలో స్పూర్తిని నింపిందని, ఆ రాష్ట్రంలో కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. 12 ఏళ్లు పోరాటమే తమ ఊపిరిగా బతికామని చెప్పారు. క్రిమినల్ పార్టీలతో తాము పోరాడామని వైసీపీ ఉద్దేశించి పవన్ కల్యాణ్ విమర్శించారు.
కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నువ్వు బీజేపీ ఆడించే తోలుబొమ్మవి.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్






