- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్. "రాష్ట్ర విభజన తీరుకే మా వ్యతిరేకత.. కాంగ్రెస్ వైఖరి ఇప్పటికీ మారలేదు" అని వ్యాఖ్యలు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ వేదికగా జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సేన ప్రస్థానం.. దేశ సమగ్రత కోసం సేనా ప్రస్థానం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్, తెలంగాణ ఏర్పాటు, కాంగ్రెస్ నేతల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సమగ్రత జనసేన సిద్ధాంతమని, దేశ స్పూర్తిని ముందుకు తీసుకెళ్లడమే జనసేన లక్ష్యమని, అందుకే ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
అలాగే జనసేన పార్టీ ఎప్పుడు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదని, విభజన చేసిన తీరుకు తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన పార్టీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, తమను అడ్డుకునేందుకే ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై తీవ్ర విమర్శలు చేశారని, నేటికి కూడా కాంగ్రెస్ తీరు మారలేదని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే సేనా ప్రస్థానం లక్ష్యాలను పార్టీ కార్యకర్థకలకు, నేతలకు వివరించారు. జనసేన పార్టీకి ఎల్లప్పుడూ సొంత ప్రయోజనాల కంటే దేశ సమగ్రత, శ్రేయస్సే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. దేశ స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను కాపాడుకోవడం అనేది ఒక్కరోజుతో ముగిసే పనికాదని, ప్రతి తరం దీనిని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అనాలోచిత తీరు వల్ల రెండు ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అశాంతి నెలకొన్నాయని.. ఆ తప్పుడు విభజన వల్లే నేటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ సహా పలు వివాదాలు నలుగుతూనే ఉన్నాయని ఆయన పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. విభజన శక్తులపై రాజీలేని పోరాటం చేయడమే తెలంగాణలో జనసేన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి తమకున్న ఏకైక నిబద్ధత అని గుర్తుచేశారు. అలాగే సొంత రాష్ట్రాల్లో ‘ఢిల్లీ మెడలు వంచుతాం’ అంటూ ప్రగల్భాలు పలికే నాయకులు, తీరా ఇక్కడికి రాగానే నోరు విప్పలేకపోతున్నారంటూ పరోక్షంగా ఇతర రాజకీయ పక్షాలపై పవన్ కల్యాణ్ పదునైన విమర్శలు గుప్పించారు.






