కేటికే 5లో తప్పిన ప్రమాదం

by Jakkula.Mamatha |

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5వ గనిలో తప్పిన పెద్ద ప్రమాదం.

కేటికే 5లో తప్పిన ప్రమాదం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5వ గనిలో తప్పిన పెద్ద ప్రమాదం. బ్లాస్టింగ్ చేస్తుండగా చేతిలోనే మందుగుండు పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీరాముల ప్రదీప్ అనే షార్ట్ ఫైరర్ కార్మికుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గని లోపల 13వ లెవెల్‌లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా సంఘటన జరిగింది. చేతిలోనే మందుగుండు పేలడంతో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలైనాయి. గాయపడిన కార్మికుడిని భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తోటి కార్మికులు తరలించారు. ప్రమాదం జరిగిన తీరుపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు.

Next Story