- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే బీజేపీని బ్యాన్ చేసేవారు: మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే బీజేపీపై నిషేధం విధించేవారు! జైపూర్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అశోక్ గెహ్లాట్.. భారతీయ జనతా పార్టీ (BJP) లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేడు గనుక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బ్రతికి ఉండి ఉంటే, మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్న బీజేపీ లాంటి పార్టీపై ఖచ్చితంగా నిషేధం (బ్యాన్) విధించేవారని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కావాలనే మతపరమైన ఎజెండాను ముందుకు నెడుతూ బీజేపీ దేశాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. తాము కేవలం 'హిందుత్వ' పార్టీ అని దేశ ప్రజలకు నిరూపించుకోవడానికే వారు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్న ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడటానికి 'ఇండియా' (INDIA) కూటమిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ కూటమికి రాహుల్ గాంధీ బహిరంగంగా నాయకత్వం వహించాలని గెహ్లాట్ కోరారు. గతంలో ఇందిరా గాంధీ కాలంలో 'కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో' అంటూ విపక్షాలన్నీ ఏకమైనప్పటికీ.. కేవలం రెండున్నర ఏళ్లలోనే ప్రజలు ఆమెను తిరిగి అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. ప్రజలు నిజం గ్రహించి కాంగ్రెస్ వైపు నిలబడిన రోజున.. ప్రస్తుతం ఎన్డీయే (NDA) కూటమిలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా మారుతాయని అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.






