- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లుండి నుంచి గాంధీ భవన్‍లో మళ్లీ మంత్రులతో ముఖాముఖీ.. దిశ కథనం నేపథ్యంలో పీసీసీ కీలక నిర్ణయం
గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం ఈనెల 17న పునఃప్రారంభం కానుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈనెల 17న గాంధీ భవన్‍లో పునఃప్రారంభం కాబోతోంది. గతంలో ప్రతి బుధవారం గాంధీభవన్లో ప్రజలతో ఒక మంత్రి ముఖాముఖి కలిసేవారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వచ్చే బుధవారం మంత్రి అజారుద్దీన్ ముఖాముఖీలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
దిశ కథనం తర్వాత పునఃప్రారంభం:
కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా గాంధీభవన్ లో నిర్వహిస్తూ వచ్చిన ఈ ముఖాముఖి కార్యక్రమం మంత్రుల బిజీ షెడ్యూల్‍తో పాటు కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు, మధ్యలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీ కారణంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం పట్ల అంతా సైలెంట్ అయిపోయారు. ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో పార్టీకి మంచి గుర్తింపు తెస్తున్న ఈ కార్యక్రమానికి బ్రేకులు పడటంతో ఈనెల 12వ తేదీన 'దిశ' దినపత్రికలో 'ముఖాముఖి.. సైలెంట్!' శీర్షికతో ఓ కథనం వెలువరించగా తాజాగా పీసీసీ నుంచి పునఃప్రారంభం ప్రకటన వచ్చింది.






