- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమాయకపు యువకుడు అలరించేందుకు సిద్ధమయ్యాడు.. ‘సూపర్ సుబ్బు’ స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్
జూలై 2 నుంచి ‘సూపర్ సుబ్బు’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘ఓ అమాయకపు యువకుడు .. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం’’ అనే క్యాప్షన్ జత చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ వైపు ‘సిగ్మా’ చిత్రం షూటింగ్‌లో బిజీగా గడుపుతూనే.. మరోవైపు ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్‌సిరీస్ ‘సూపర్ సుబ్బు’ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో సందీప్ కిషన్‌కు జోడీగా మిథిలా పాల్కర్ నటిస్తుండగా.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. ఇందులో టాలీవుడ్ కామెడీ కింగ్స్ బ్రహ్మానందం, మురళీ శర్మ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మాసన చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా, ఈ సిరీస్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
జూలై 2 నుంచి ‘సూపర్ సుబ్బు’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘ఓ అమాయకపు యువకుడు .. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఓ ఆసక్తికర వీడియోతో కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇందులో.. ఆగ్రహంతో ఊరి జనాలు, దుండగులు సుబ్బును చంపేందుకు కర్రలతో వెంటపడతారు. సందీప్ కిషన్, గెటప్ శ్రీను పరుగెడుతుండగా.. దారిలో జూలై 2న రాబోతున్నట్లు అనౌన్స్ చేసి క్యూరియాసిటీని పెంచారు.. ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. సుబ్రమణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) ఒక అమాయకపు యువకుడిగా కనిపించనున్నట్లు టాక్.






