- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు బీజేపీ ఆడించే తోలుబొమ్మవి.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్
తెలంగాణ, కాంగ్రెస్‌లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరిట ఇవాళ ఢిల్లీలో ఆపార్టీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన పవన్.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరించిన తీరు సరిగా లేదని అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి ఇంకా మారలేదని అన్నారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ అన్న పవన్.. ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామంటూ చాలామంది పెద్దలు మాటలు చెబుతారని అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ పదే పదే కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పవన్ కించపరచడం ఇదేం కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కల్యాణ్ :
తెలంగాణ కలను కాంగ్రెస్ సాకారం చేసిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోడీ, బీజేపీ నేతలు కించపరుస్తున్నారన్నారు. బీజేపీ నేతలు పలికితే పవన్ మాట్లాడుతున్నాడని బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. విచ్చలవిడిగా మాట్లాడటనానికి ఇదేమీ సినిమా కాదని ఎంతో మంది అమరులైతే, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు చూడనిదే నీ సినిమాలు ఆడాయా? ఇంత పెద్ద హీరోవు అయ్యావా? అని ప్రశ్నించారు.
నువ్వింకా చాలా నేర్చుకోవాలి:
ఏపీ డిప్యూటీ సీఎంగా ఏపీలో మీరు చెయ్యాల్సింది ఉందని రాజకీయాల్లో ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సరికాదని, ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ గురించి శ్రద్ధగా చరిత్రలు చదువుకుంటే మంచిదని నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం గురించి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్‍ను అనాలంటే సినిమాల్లో డైలాగ్ చెప్పినట్టు కాదని మీ నాయకుడు మోడీ రాకెట్ ముందు ఫొటోలు దిగుతున్నారంటే అది కాంగ్రెస్ ఘనత అన్నారు. విభజనకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు.. ఏ సినిమాల్లో ఉన్నాడని నిలదీశాడు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత పవన్‍కు లేదని ఆయన రాజకీయంగా చాలా చిన్నవాడన్నాడు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో విభజన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. రెండు రాష్ట్రాలు వేరైన అన్నదమ్ములుగా కలిసి ఉందామని, తెలంగాణ రాజకీయాల కోసం మమ్మల్ని అంటే ఊరుకోనన్నారు. అభివృద్ధి,సంక్షేమంలో ఏపీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. పవన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ (BRS) ఎవ్వరు మాట్లాడటం లేదంటేనే వారి వెనుక ఒప్పందం ఏంటో అర్థం అవుతుందన్నారు.
కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్






