కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ యువ నేత ఎండీ సల్మాన్..

by Kodari Anjali |

కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎండీ సల్మాన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ యువ నేత ఎండీ సల్మాన్..
X

దిశ, కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎండీ సల్మాన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఆకర్షితులై ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎల్‌కే గార్డెన్‌లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏ సన్నాహక సమావేశంలో ఎండీ సల్మాన్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే సత్యం పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోగూరి నాగ భూషణ్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ రాజా నర్సింగరావు, సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, మండల అధ్యక్షుడు కడారి మల్లేశం, ఏఎంసి వైస్ చైర్మన్ రాజేష్,నాయకులు మహిపాల్ రెడ్డి,కమలాకర్ రెడ్డి, ముత్యం శంకర్,మ్యాకల మల్లేశం, అజయ్ రెడ్డి, వినోద్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story