అడ్వకేట్స్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్

by  |
అడ్వకేట్స్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పివి నాగమణిలపోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఊహించని విధంగా రిటైర్డ్ ఇంజనీర్ వెల్ది వసంత్ రావును అరెస్ట్ చేశారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ లో ఏ1 నిందితునిగా వసంతరావును చేర్చిన పోలీసులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ లను అదుపులోకి తీసుకున్న తరువాత అతని పేరును తొలగించి మరో ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ హత్య కేసుతో సంబందం ఉన్న నిందితుల పేర్లు వెలుగులోకి వస్తున్న కొద్ది వామన్ రావు అక్యూజ్డ్ సీరియల్ నెంబర్ ను మార్చుకుంటు వచ్చారు. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం వసంతరావు ఏ7 నిందితునిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన ప్రమేయం లేదని చార్జీ షీట్ లో పేరు తొలగించే అవకాశాలు ఉన్నాయని బావించారంతా. కానీ గురువారం వసంతరావును అరెస్ట్ చేశామని రాత్రి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా వసంతరావును అరెస్ట్ చేసిన పోలీసులు సంచలనానికి తెర లేపారు.

అందుకేనా..?

వామన్ రావు దంపతుల హత్య తరువాత తామిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారిని పోలీసులు తప్పించారని గట్టు కిషన్ రావు ఆరోపించారు. ఈ విషయంలో తాను పోలీసుల ముందు మరోసారి వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. దీంతో పోలీసులు వెల్ది వసంతరావు పేరును చేర్చక తప్పలేదని స్పష్టం అవుతోంది. వసంతరావును ఈ కేసులో నుండి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఊహించని విధంగా ఆయన్ను అరెస్ట్ చేయడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి.

హత్యకు ప్రోత్సహించాడు: పోలీసులు

గట్టు వామన్ రావు హత్యకు కాళేశ్వరం ప్రాజెక్టు రిటైర్డ్ డీఈఈ వెల్ది వసంతరావు ప్రోత్సహించాడని పోలీసులు వివరించారు. 2018లో రిటైర్డ్ అయిన వసంతరావు గుంజపడుగులో నిర్వహించే కార్యక్రమాలకు తరుచూ హాజరయ్యేవారని, ఈ సమయంలోనే కుంట శ్రీనుతో పరిచయం ఏర్పడిందన్నారు. గ్రామంలో పెద్దమ్మ గుడి, తన సొంత ఇంటి నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయని గట్టు వామన్ రావు నోటీసులు ఇప్పించాడని కుంట శ్రీను వెల్ది వసంత రావుకు చెప్పుకుని మథనపడేవాడని వివరించారు. గత సెప్టెంబరు 24న వెల్ది వసంత రావు బ్రాహ్మణ కుల సంఘానికి అధ్యక్షుని గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. అప్పటి నుంచి జరిగిన పలు కార్యక్రమాల్లో అభ్యంతరాలను గట్టు వామన్ రావు వ్యక్తం చేసేవాడని తెలిపారు.

జనవరి 26న జెండావందనం తర్వాత గుంజపడుగ బ్రాహ్మణ సంఘం భవనం ఇంచార్జి అయినా రేగళ్ళ ప్రదీప్ కుమార్ పై గట్టు కిషన్ రావు గట్టు ఇంద్ర శేఖర్ బుడంగారి శ్రీనాథ్, వెల్ది సుధాకర్ కలిసి దాడి చేశారని బాధితున్ని తీసుకుని మంథని పోలీసలకు ఫిర్యాదు చేయాలని వసంతరావు కార్యదర్శి గట్టు విజయ్ కుమార్ కు చెప్పారన్నారు. ఈ విషయం తెలుసుకున్న గట్టు వామన్ రావు వెల్ది వసంత్ రావుపై రామగుండం సీపీకి కిషన్ రావు, చంద్రశేఖరరావుల చే పిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
వెల్ది వసంత రావు, అతని కొడుకు అవినీతి బాగోతం బయట పెడతాం, ఏసీబీకి ఫిర్యాదు చేస్తామంటూ గట్టు వామన్ రావు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంతో వెల్ది వసంత రావు కుంట శ్రీనుకి ఫోన్ చేసి వామన్ రావు తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయనను ఏమైనా చేయాలి అని కుంట శ్రీను ని కోరినట్టు పోలీసులు చెప్పారు.

దీంతో వామన్ రావును కూడా ఇబ్బందులకు గురి చేయాలని ఇందుకు బ్రహ్మణ సంఘం కూడా సహకరించాలని కుంట శ్రీను వెల్ది వసంతరావుకు చెప్పి రివేంజ్ మొదలు పెట్టారని పోలీసులు వివరించారు. ఇందులో భాగంగానే రామస్వామి, గోపాలస్వామి గుడి కమిటి చైర్మన్ గా ఉన్న గట్టు ఇంద్ర శేఖర్ ని తొలగించి కొత్త కమిటిని వేయడంతో తనను చంపేస్తానని వామన్ రావు వార్నింగ్ ఇచ్చిన విషయం కుంట శ్రీనుకు చెప్పుకున్న వసంతరావు వామన్ రావుని లేపెయ్యేలని, అతని పీడవిరగాడయ్యేలా చేస్తే అన్ని రకాల సాయం చేస్తానని కూడా చెప్పాడని తమ విచారణలో తేలినట్టు పోలీసులు వివరించారు.

Next Story

Most Viewed