'ఫస్ట్ నో చెప్పింది.. తెల్లారొచ్చి ముద్దులిచ్చింది'

by  |
kiss1
X

దిశ, సినిమా: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ జీషన్ ఖాన్ ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ కోస్టార్‌ రేనా పండిట్‌తో రిలేషన్‌ గురించి సోషల్ మీడియాలో ఓపెన్‌గా వెల్లడించాడు. కొన్ని నెలలుగా ఆమెతో డేటింగ్‌లో ఉన్న జీషన్.. తనకు మొదటిసారి ‘ఐ లవ్ యూ’ చెప్పినప్పుడు ఆమె పట్టించుకోలేదని, కానీ.. ఆ మరుసటిరోజు దగ్గరికి వచ్చి ముద్దులతో ముంచెత్తిందని చెప్పాడు. రేనాకు ఆ మాట చెప్పేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానని, ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పటివరకు ఉన్న ఫ్రెండ్‌షిప్ పాడైపోతుందని భయపడ్డానని తెలిపాడు.

ఆ ఇన్సిడెంట్ గుర్తుచేసుకున్న జీషన్.. ‘ఒకరోజు తనతో కలిసి టీవీ చూస్తున్నపుడు ‘ఐ లవ్యూ’ చెప్పా. అయితే ఆమె ఏమీ పట్టించుకోకుండా సినిమా చూస్తూ ఉండిపోయింది. ఆ టైమ్‌లో నా మనసులో ఇలా ఎందుకు చేశాననే కల్లోలం మొదలైంది. నెక్ట్స్ డే మార్నింగ్ లేవగానే, కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీశాను. కళ్లెదుట రేనా.. కాల్ చేయలేదని అడుగుతుండగానే.. ముఖంపై ముద్దుల వర్షం కురిపించింది’ అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ టైమ్‌లో రేనాతో ఏదీ చెప్పకుండా కొద్దిసేపు ఆ రోజు రివెంజ్ తీసుకున్నానని వెల్లడించాడు.

గుడ్‌న్యూస్ చెప్పిన కాజల్.. కుటుంబంలో ఒకరు చేరుతున్నారంటూ పోస్ట్



Next Story

Most Viewed