చేసిన సాయం చంపేసింది

by  |
చేసిన సాయం చంపేసింది
X

దిశ‌, వెబ్‌డెస్క్: ఓ యువకుడు తన స్నేహితులకు చేసిన సాయం.. అతడి ప్రాణాలనే తీసుకుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న పాపానికి మోసం చేశారంటూ మనస్తాపంతో ఉరేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం రామకృష్ణాపురంలో వెలుగుచూసింది. వివరాళ్లోకి వెళితే.. ఏలూరు రామకృష్ణాపురానికి చెందిన ఫణికుమార్ (27) తాపీ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఉన్న ఒక్కగానొక్క చెల్లి పెళ్లి చేశాడు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం గడుపుతున్న అతడు స్నేహితులతో ఎక్కువగా ఉండేవాడు.

అయితే, ఫణికుమార్‌కు గణపతి, రాజేశ్‌లు బాగా సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఫణికుమార్‌కు చెప్పుకున్నారు. ఎలాగైనా డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో ఫణికుమార్ తనకు తెలిసిన వాళ్ల దగ్గర మొత్తం 7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి దబ్బులు చెల్లించే పూచి తనదని వారికి హామీ ఇచ్చాడు. ఆ డబ్బులను తన స్నేహితులకు ఇచ్చాడు. అవసరానికి డబ్బులు తీసుకున్న మిత్రులు ఇవ్వడంలో జాప్యం చేశారు. అటు అప్పు ఇచ్చిన వారు నుంచి ఫణి కుమార్‌కు ఒత్తిడి పెరిగింది.

డబ్బులు ఇవ్వమంటున్నారని తన స్నేహితులను ఎంత అడిగిన ఎదో ఒక సాకు చెబుతూ తప్పించుకు తిరిగారు. దీంతో అతనికి ఏం చేయాలో అర్ధం కాలేదు. గణపతి, రాజేశ్‌లకు డబ్బులు చెల్లిస్తారా లేదా అని సూటిగా అడగడంతో.. మా దగ్గర లేవు అని వారు సమధానం ఇచ్చారు. అప్పు తీర్చలేమని తేల్చి చెప్పేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగానే అప్పు తీసుకొని తనను ఇరికించారని మనస్తాపం చెందిన ఫణికుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఊరి వేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed