సంభాషణలు రికార్డు చేసిన ప్రముఖ ఛానల్.. రోహిత్ శర్మ సీరియస్

by GSrikanth |
సంభాషణలు రికార్డు చేసిన ప్రముఖ ఛానల్.. రోహిత్ శర్మ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యారు. స్నేహితులు, తోటి ప్లేయర్లతో మాట్లాడుతున్న మాటలను రికార్డు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాలకు గోప్యత లేకుండా పోయిందని ఆవేదన చెందారు. రేటింగ్, వ్యూస్ కోసం చేసే ఇలాంటి పనులు ఏదో ఒకరోజు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య విశ్వాసాన్ని బ్రేక్ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మ్యాచ్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సిబ్బందితో రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో ఆ వీడియోపై రోహిత్ అసహనం వ్యక్తం చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఐపీఎల్ సీజన్ నుంచి రోహిత్ శర్మ కీలకంగా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 14 మ్యాచులు ఆడిన ముంబై.. కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలోనూ చివరి స్థానంలో ఉంది.

Next Story

Most Viewed