అంతరిక్షంలో హోటల్.. ‘వొయేజర్’ పేరుతో నిర్మాణం

by  |
అంతరిక్షంలో హోటల్.. ‘వొయేజర్’ పేరుతో నిర్మాణం
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలోనూ మానవ మనుగడ సాధ్యమయ్యే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ఈ మేరకు పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు సాధారణ పౌరులను కూడా స్పేస్ మిషన్‌లో భాగం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ మానవ నివాసం సాధ్యమైతే, వారికి అనుగుణమైన మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి కదా. ఈ క్రమంలోనే ‘ఓరియన్ స్పాన్’ అనే సంస్థ ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ హోటల్‌ను నిర్మించనుంది.

‘వొయేజర్’ పేరుతో స్పేస్ హోటల్‌ ఏర్పాటుకు సిద్ధమైన ఓరియన్ స్పాన్.. 2025లో నిర్మాణం చేపట్టి 2027వరకు అతిథులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ హోటల్‌లో 400 మందికి సరిపడా వసతితో పాటు బార్‌లు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, లైబ్రరీలు, కన్సర్ట్ స్టేజెస్ (కచేరీ వేదికలు), హెల్త్ స్పా, జిమ్, ఎర్త్ వ్యూయింగ్ లాంజ్‌లు కూడా ఉండనున్నాయి.

‘జాతీయ అంతరిక్ష సంస్థల పరిశోధకులకు, అంతరిక్ష పర్యాటకులు సౌకర్యంగా ఉండేలా ఈ హోటల్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాం. అరోరా స్టేషన్‌ లేదా వొయేజర్‌లో 12 రోజుల పాటు బస చేసేందుకు 9.5 మిలియన్ డాలర్లు చెల్లించాలి. అయినా ఇది ఆర్బిటల్ టూరిస్ట్‌లు గతంలో చెల్లించిన దానికంటే కొంచెం తక్కువే. 2001 – 2009 వరకు ఏడుగురు ప్రైవేట్ సిటిజన్స్ మొత్తంగా ఎనిమిదిసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి ప్రయాణాలు చేశారు. ఇందుకోసం ప్రతిసారీ 20 మిలియన్ల డాలర్ల నుంచి 40 మిలియన్ల డాలర్ల వరకు చెల్లించారు. ఈ ప్రైవేట్ మిషన్లను వర్జీనియాకు చెందిన స్పేస్ అడ్వెంచర్స్ కంపెనీ చేపట్టింది. ఇక మా అరోరా స్టేష‌న్‌ నిర్మాణంలో, మోడల్ రూపకల్పనలో ఐఎస్ఎస్‌‌కు పనిచేసిన ఇంజనీర్లు సాయపడ్డారు. హ్యూస్టన్‌లో హోటల్‌ను తయారు చేస్తున్నారు. బే ఏరియాలో దీన్ని అమలు చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు’ అని నిర్వాహకులు తెలిపారు.

అంతరిక్ష తోటకూర.. పోషకాలు అమోఘం



Next Story

Most Viewed