- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై గుడ్లతో దాడి
by velandi.Saikiran |
TMC ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మజుందార్ పై కోల్ కతా లో కొంత మంది కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాలలో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల అభిషేక్ బెనర్జీపై అత్యంత దారుణంగా గుడ్లతో దాడి జరిగింది. అయితే ఈ సంఘటన జరిగి వారం తిరగక ముందే, మరో త్రిణమూల్ కాంగ్రెస్ నేత దాడికి గురయ్యాడు. ప్రాపర్టీ ఆక్రమణ కేసులో అరెస్ట్ అయిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మజుందార్ పై కోల్ కతా లో కొంత మంది కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన వైరల్ గా మారింది. వివాదంలో ఉన్న ఆ ప్రాపర్టీని పరిశీలించేందుకు జయప్రకాష్ ను వెంట తీసుకొని వెళ్లారు పోలీసులు. ఈ క్రమంలోనే జయప్రకాశ్ పై కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడి జరగగానే, కారులోంచి తాను అస్సలు దిగబోనంటూ నిరసన తెలిపారు జయప్రకాశ్. క్లిక్
Next Story






