- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడేజా-అశ్విన్ లేకుండా.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి!
16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అశ్విన్, జడేజా ఇద్దరు కలిసి 69 టెస్టులు ఆడారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేటి నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా కేవలం ఒకే ఒక్క టెస్ట్ జరగనుంది. అయితే ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జడేజా, అశ్విన్ లేకుండానే 16 సంవత్సరాల తర్వాత తొలి టెస్ట్ ఆడుతోంది భారత జట్టు. భారత్ తో టెస్ట్ మ్యాచ్ అంటే అందరికీ ముందుగా జడేజా, అశ్విన్ కాంబో మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇక్కడి మైదానాలపై ఈ స్పిన్ ద్వయం చూపించిన ప్రభావం అలాంటిది మరి.
అయితే 2010 నవంబర్ నుంచి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకుండా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు భారత జట్టు. కానీ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తో ఈ ఇద్దరు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అశ్విన్, జడేజా ఇద్దరు కలిసి 69 టెస్టులు ఆడారు. కాగా అంతర్జాతీయ క్రికెట్ ఇప్పటికే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. రవీంద్ర జడేజాను సెలెక్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే జడేజా, అశ్విన్ ను మిస్ అవుతున్నట్లు క్రికెట్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య నేటి నుంచి ముల్లాన్ పూర్ లో టెస్ట్ జరగనుంది.






