అంతరిక్ష తోటకూర.. పోషకాలు అమోఘం

by  |
అంతరిక్ష తోటకూర.. పోషకాలు అమోఘం
X

దిశ, వెబ్‌డెస్క్:
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పెంచిన అంతరిక్ష తోటకూరకి, భూమ్మీద పెంచిన తోటకూరలు పోషకాల విషయంలోనూ ఒకే విధంగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. నాసాలో పనిచేసే గియోవా మాస్సా, క్రిస్టీనా ఖోదాడ్‌లు కలిసి 2014 నుంచి 2016 వరకు ఐఎస్ఎస్‌లో పెంచిన తోటకూరలను దగ్గరుండి పరిశోధన చేసి ఈ విషయం కనిపెట్టారు. భూమ్మీద తమ ఇంట్లో కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులను సృష్టించి తోటకూరను పెంచారు. ఆర్థ్రత, కార్బన్ డయాక్సైడ్ పరిమాణం, ఉష్ణోగ్రతలను అలాగే ఉంచి, తోటకూరలో పోషకాల పరిమాణాన్ని లెక్కించారు.

అయితే ఈ రెండింటి మధ్య ఒకే ఒక తేడా ఉందని వారు పేర్కొన్నారు. అంతరిక్షంలో పెరిగే మైక్రోఫ్లోరా కారణంగా అంతరిక్ష తోటకూరలో ఎక్కువ మైక్రోఆర్గానిజమ్స్ ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఆర్గానిజమ్స్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని, పోషకాల విషయంలో వాటిని పరిగణించకపోవడమే మంచిదని సూచించారు. ఈ పరిశోధన వల్ల అంతరిక్షంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు ఐఎస్ఎస్‌లో ఉంటున్న వారికి భూమ్మీది నుంచి ఆహారం పంపుతున్నారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆహారం డెలివరీ ఆలస్యమైతే వారు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇలా అక్కడే కూరలు పెంచుకునే వీలు కలిగించొచ్చు. త్వరలో చంద్రుడు, అంగారకుని మీద కూడా మిషన్లు చేపడుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన చాలా ఉపయోగపడనుందని మాసా, ఖోదాడ్‌లు వివరించారు.

Tags: ISS, International Space Station, NASA, Lettuce, Food, Grown, Delivery


Next Story

Most Viewed