అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

by velandi.Saikiran |

ఇరాన్ పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా... వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ఇందులో పలుగురు రిపబ్లికన్ సభ్యులు ప్రతిపక్ష డెమోక్రాట్ల‌తో చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తీర్మానానికి అనుకూలంగా ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో 100+బిలియన్ల భారం అమెరికాపై పడిందని ఈ సందర్భంగా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఇరాన్ ముందు అమెరికా బలహీనపడేలా చేసిందని విమర్శలు గుప్పించారు. అనవసర, భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు సభలో ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ నకు ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉండగా అంతకు ముందు ఇరాన్-అమెరికా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ వీకెండ్ లో ఇరాన్ తో డీల్ కుదరబోతుందని స్పష్టం చేశారు. చర్చలు సాఫీగా సాగుతున్నాయని చెబుతూనే, డీల్ కుదురుతుందో ? లేదో ? గ్యారెంటీ ఇవ్వలేమని మెలిక కూడా పెట్టారు. ఇంతలోనే ప్రతినిధుల సభలో ఆయనకు ఎదురుగాలి వీచింది.

Next Story